వరుణ్…’మిస్టర్‌’ ఫస్ట్ లుక్

111
Varun Tej Mister First Look

కొత్త సంవత్సరం వేడుకల్లో సందడి అంతా మెగా హీరోలదే కనిపిస్తోంది. ఇప్పటికే చిరు, పవన్లు కొత్త సినిమాలతో హవా చూపిస్తుండగా ఇప్పుడు రేసులోకి యంగ్ మెగా హీరోలు కూడా చేరిపోయారు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 సింగిల్స్ యూట్యూబ్ రికార్డ్ల దుమ్ముదులుపుతున్నాయి. జనవరి 4న విజయవాడలో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను జరగనుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక కాటమరాయుడుతో రేసులోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీ లుక్, ఫస్ట్ లుక్లతో హవా చూపిస్తున్నాడు. తాజాగా కాటమరాయుడు…మోషన్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు. సుప్రీమ్‌ హీరో సాయిధరమ్ తేజ్‌ సైతం విన్నర్‌తో మెగా అభిమానులకు నూతన సంవత్సర కానుకగా పోస్టర్‌ను విడుదల చేసి సందడి చేశాడు.

Varun Tej Mister First Look

తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఈ రేసులోకి అడుగుపెట్టాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా మిస్టర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి పోస్టర్ విడుదల చేయని టీం టైటిల్ తో ఉన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. తాజాగా మిస్టర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది.

Varun Tej Mister First Look

రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై శ్రీను వైట్ల భారీ అంచనాలే పెట్టుకున్నాడు. దూకుడు, బాద్‌షా వంటి హిట్ల తర్వాత ఆగడు, బ్రూస్‌లీ వంటి ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అవకాశాలు కొంత మేర తగ్గాయి. తాజాగా శ్రీను వైట్ల ప్రతిష్టాత్మకంగా తన మార్క్‌ చూపించడానికి ముందుకువస్తున్నాడు. వరుణ్ సరసన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Varun Tej Mister First Look Poster