న్యూ ఇయర్ ట్రీట్…త్రివిక్రమ్‌కే ఎన్టీఆర్ ఫిక్స్

96
Trivikram - NTR Film Launch in 2017

ఎన్టీఆర్ అభిమానులకు ఇది కచ్చితంగా నూతన సంవత్సర కానుకే. ఎందుకంటే కొంతకాలంగా అభిమానులను ఉరిస్తున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌ల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ పడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం ను నిర్మించ నున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం, నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా ప్రకటించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు.

2017 సెప్టెంబర్ లో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆ..ఆ వంటి ఘనవిజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఈ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ నున్న చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Trivikram - NTR Film Launch in 2017

ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్ లు చాలా ఆసక్తిగా వుంటాయి.. ఎందుకో అంత త్వరగా సెట్ కావు. అలాంటివాటిలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. మరి ఎక్కడ సమస్యో కానీ, ఈ కాంబినేషన్ మాత్రం సెట్ కావడం లేదు. గతంలో ఒకసారి ఈ కాంబినేషన్ సెట్ అయ్యేదే..చివరి నిమిషంలో ఆగిపోయింది. కానీ చాలాకాలం గ్యాప్ తర్వాత వీరి క్రేజీ కాంబినేషన్‌కి ముహుర్తం ఫిక్స్ కావటంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఖచ్చితంగా ఇది న్యూ ఇయర్ ట్రీట్ అంటూ సంబురపడిపోతున్నారు.