థ్రిల్లింగ్‌గా…. ‘నేనోరకం’

164
nenorakam

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం నేనోరకం. చిత్రీకరణ పూర్తి చేసుకొంది. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది . ఈ కొత్త సంవత్సరంలో ఆడియోన్స్ ను అలరించేలా ” నేనోరకం ” ఉంటుందని చిత్ర బృందం కాన్పిడెంట్ గా ఉంది.

Sairam Shankar

ఈసందర్బంగా ..సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ.. ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేనోరకం అనే టైటిల్ మా ఈ సినిమాకు కరెక్ట్ గా యాప్ట్. ఆడియెన్స్ ను అలరించటంతో పాటు , ఆలోచింపచేసేలా , కాంటెపరరీ ఇష్యూస్ ను స్పూర్తిగా తీసుకొని , ఇంట్రెస్టింగ్ కంటెంట్తో థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబడిన చిత్రమిదన్నారు..

శరత్ కుమార్ మాట్లాడుతూ..2017 లో అందరికి మంచి జరగాలని ఆశిస్తూ.. హ్యాపి న్యూ ఇయర్. ఈ మధ్య కాలంలో సౌత్ లో అందులోనూ తెలుగు సినీ పరిశ్రమ నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి.నేనోరకం సైతం అదే కొవలో వస్తున్న ట్రెండీ మూవీ. దర్శకుడి కథ, కథనమే ఈ సినిమాకు హైలెట్. ఈ సినిమా టీమ్ అందరికి మంచి పేరును తీసుకు వస్తుందన్నారు..

Sairam Shankar

దర్శకుడు సుదర్శన్ మాట్లాడుతూ.. నూతన సంవత్సరం ప్రారంభాన అందరికి శుభాకాంక్షలు. “నేనోరకం” టైటిల్ కు తగ్గట్టుగానే సరికొత్త ట్రీట్ మెంట్ తో సినిమా రూపొందించటం జరిగింది. సాయిరామ్ శంకర్ -శరత్ కుమార్ ల నటన ,వారిద్దరి మధ్య వచ్చె సన్నివేశాలు ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ను కలుగచేస్తాయన్నారు.

నిర్మాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… కొత్త సంవత్సరంలొ మా సంస్థ ద్వారా ఓ సరికొత్త కమర్షియల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. త్వరలొనె పాటలను విడుదల చెయనున్నాము.అన్ని వర్గాల వారిని అలరించెలా ఈ సినిమా మరియు టైటిల్ ను సిద్దం చేయటం జరిగింది. తెలుగుతో పాటు తమిళ్ లో సైతం ఈ సినిమాను విడుదల చెస్తామన్నారు..రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఎం.ఎస్ నారాయణ , ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్