ఘనంగా వరుణ్ – లావణ్య వివాహం..

55
- Advertisement -

నాగబాబు, పద్మజ కొణిదెల కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దేవరాజ్, కిరణ్ త్రిపాఠిల కూతురు లావణ్య త్రిపాఠి ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీలోని టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌ లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇరు కుటుంబాలకు చెందిన వారు హాజరయ్యారు.

పెళ్లి కోసం, వరుణ్ తేజ్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్-గోల్డ్ షేర్వాణిని ధరించగా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కాంచీపురం చీరను లావణ్య త్రిపాఠి ధరించింది. అశ్విన్ మావ్లే – హసన్ ఖాన్ ఈ జంట కోసం స్టైలింగ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, నితిన్ తో పాటు లావణ్య కుటుంబసభ్యులు. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అక్టోబర్ 30న కాక్‌టెయిల్ పార్టీతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కాగా తర్వాత హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి.

Also Read:కివీస్ హ్యాట్రిక్ ఓటమి..

- Advertisement -