వక్కంతం వంశీ దర్శకత్వంలో వరుణ్..!

344
varun tej

గద్దలకొండ గణేష్‌తో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాడు హీరో వరుణ్ తేజ్‌. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న వరుణ్ ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టీ టౌన్ వర్గాల సమాచారం.

నాపేరు సూర్య సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీతో మూవీకి కమిట్ అయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో తొలిసినిమాతో మంచి మార్కులు కొట్టేసిన వంశీ….వరుణ్‌తో హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ 10వ సినిమాగా తెరకెక్కుతుండగా రెనైసాన్స్ పిక్చర్, అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా తమన్ సంగీతం అందించనున్నాడు.

varun tej commits movie for Vakkantham Vamshi..!…varun tej commits movie for Vakkantham Vamshi..!..varun tej commits movie for Vakkantham Vamshi..!