‘ఓన్లీ నేను’ ట్రైలర్ లాంచ్..

348

శరకడం స్టోరీస్ పతాకంపై చెంగ్, మైరా అమితి జంటగా విగ్నేష్ కలగర డైరెక్షన్‌లో శ్రీనివాస్ శరకడం నిర్మిస్తోన్న చిత్రం`ఓన్లీ నేను`. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఈ రోజు ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా విచ్చేసిన నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ..`ఓన్లీ నేను` టీజర్ బావుంది. ముఖ్యంగా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ హైలైట్. ఇక శ్రీనివాస్ ఈ నెల 15న ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్ అనే వినూతనమైన కార్యక్రమం చేపడుతున్నారు. కొత్త డైరెక్టర్స్,, కొత్త నిర్మాతలకు ఇది మంచి వేదిక అవుతుంది“ అన్నారు.

kashivishwanath

తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ మామిడి హరి కృష్ణ మాట్లాడుతూ..`ఓన్లీ నేను`ట్రైలర్ బావుంది. డైరెక్టర్ ప్రతిభ ఏంటో ట్రైలర్‌తో తెలుస్తుంది. ఇక నిర్మాత శ్రీనివాస్ ఒక వైపు సినిమా చేస్తూనే మరోవైపు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ నెల 15న నిర్వహిస్తున్నారు. నిజంగా ఇది గొప్ప ప్రయత్నం. ఇండియన్ ఫ్యాషన్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్ న్యూ డైరెక్టర్స్, న్యూ ప్రొడ్యూసర్స్ కి చాలా ఉపయోగపడుతుంది. ఔత్సాహికులు పాల్గొని తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునే మంచి అవకాశం“ అన్నారు.

mamidi harikrishna

చిత్ర నిర్మాత శ్రీనివాస్ శరకడం మాట్లాడుతూ…`ఇండియన్ ఫాషన్ అండ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఒక తెలుగులో ఒక వినూతన కార్యక్రమం ఈ నెల 15న శిల్పారామం లో చేస్తున్నాం. ఔత్సాహిక దర్శకులందరూ వారి టీజర్స్ , వారి కాన్సెప్ట్స్ ప్రదర్శించడం జరుగుతుంది. అదే కార్య క్రమం లో పాల్గొనబోయే నూతన నిర్మాతల్లో కొందరు ఆయా దర్శకులలో కొందరిని ఎంచుకుని తమ ప్రాజెక్ట్స్ కు సైన్ చేయడం మా ముఖ్య ఉద్దేశం. దీని వలన న్యూ డైరెక్టర్స్ ,టాలెంట్ ఉండి అవకాశాలు లేని వాళ్లకు, సినిమా వాళ్ళతో పరిచయాలు లేని వారికి ఉపయోగపడుతుంది. ఆడిషన్స్ ద్వారా నటీనటులు కూడా వారి యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవచ్చు. ఇక మా సినిమా ఓన్లీ నేను ట్రైలర్ లాంచ్ చేసాము. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం “ అన్నారు.

ONLY NENU Movie Trailer Launch

చిత్ర దర్శకుడు విగ్నేష్ మాట్లాడుతూ… ఓన్లీ నేను సినిమా షూటింగ్ ఫైనల్ లో ఉంది. థ్రిల్లర్ కాన్సెప్ట్. ఒక స్కాం ని బేస్ చేసుకుని సినిమా అంతా ఉంటుంది. సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేస్తాం“ అన్నారు. డైరెక్టర్ వీరభద్రం మాట్లాడుతూ…`సినిమా ట్రైలర్ ఇంట్రస్టింగఃగా ఉంది. డైరెక్టర్‌కి, నిర్మాతకు నా శుభాకాంక్షలు అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కే వోలేటి, మ్యూజిక్:ఎస్. కె .బాలచంద్రన్ , ఎడిటర్: రాము, సాంగ్స్: ఇమ్రాన్ శాస్త్రి, నిర్మాత: శ్రీనివాస్ శరకడం , డైరెక్టర్: విగ్నేష్ కలగర.

ONLY NENU Telugu Movie Trailer Launch At Film Chamber In Hyderabad..ONLY NENU Telugu Movie Trailer Launch At Film Chamber In Hyderabad..