మీడియా ముందు మాట్లాడితే హీరో అయిపోరు!

23
nv prasad

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌కు కౌంటరిచ్చారు ఫిలిం ఛాంబర్ మాజీఅధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ప్రసాద్…నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు బాధాకరం అన్నారు. కొవ్వూరులో ప్రసన్న కూమార్ రెడ్డి అంటే ఏంటో అందరికి తెలుసు…నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉంది…అనవసరపు వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చుకోవద్దన్నారు.

వంద అడుగులు పైనుంచి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో తెలుస్తుందన్నారు. మీడియా ముందు మాట్లాడితే హీరో అయిపోరని..బలిసి కొట్టుకుంటోంది మీరే…ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. సినిమా వాళ్ళని అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదు….సినిమా నిర్మాణం ఎంత కష్టమో వచ్చి ప్రత్యక్షంగా చూడాలన్నారు. నా సినిమా నిర్మాణం సమయంలో ప్రసన్నకుమార్ ను ఆహ్వానిస్తానని చెప్పారు.