త్వరలో మార్కెట్‌లోకి AA బ్రాండ్!

23
aa

AA ఈ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది అల్లు అర్జున్. తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్న బన్నీ ఇప్పుడు విజయ్ దేవరకొండ బాటలోనే పయనించనున్నారు. సొంతంగా దుస్తుల వ్యాపారం ఆరంభించబోతున్నాడట.

తన ఇమేజ్ ని ఎఎ బ్రాండ్ రూపంలో ప్రమోట్ చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ తను ఆరంభించబోయే దుస్తులకు కూడా ఎఎ బ్రాండ్ వేర్ గా మార్కెట్ లోకి తీసుకు రాబోతున్నాడట. అతి త్వరలో వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కోవిడ్ మూడోవేవ్ ఉదృతంగా ఉన్నందువల్ల ఎఎబ్రాండ్ లాంచింగ్ కొద్దిగా ఆలస్యం అయిందని లేకుంటే ఈ పాటికే ఎఎబ్రాండ్ మార్కెట్ లో ఉండి ఉండేదని చెబుతున్నారు. పరిస్థితులు మామూలు స్థితికి చేరగానే బన్నీ ఎఎ బ్రాండ్ లాంచ్ అవుతుందని అంటున్నారు.