ఆమె ఏకంగా ఎన్టీఆర్ తోనే..

135
- Advertisement -

విజయాల్లో లేని భామలకు అవకాశాలు ఇవ్వడంలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటారు. తన సినిమాల్లో స్టార్ హీరోయిన్ ఉండాలని జూ :ఎన్టీఆర్ కోరుకోరు. కథకు, క్యారెక్టర్‌కు ఎవరు సూట్ అయితే వాళ్ళను ఎంపిక చేసుకునే ఫ్రీడమ్ దర్శక నిర్మాతలకు ఇస్తారు. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాలోనూ హీరోయిన్ ట్రాక్ రికార్డ్ కంటే టాలెంట్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలిసింది. అందుకే.. యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో పక్కన చిన్నాచితకా చిత్రాల భామ వర్ష బొల్లమ్మ హీరోయిన్ అంటే..నమ్మశక్యం కావడం లేదు. కానీ.. ఆమె మంచి నటి. అంతకు మించి ఎమోషనల్ పాత్రలను అద్భుతంగా పండించగలదు. అందుకే.. ఆమెను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు కొరటాల. కాకపోతే ఆమెది సెకండ్ హీరోయిన్ పాత్ర అని తెలుస్తోంది. ఇక కొరటాల సినిమాలో ఎన్టీఆర్ కి కథానాయికగా పలువురి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

అందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, సోనాక్షీ సిన్హా.. అలాగే జాన్వీ కపూర్ పేరు కూడా ఉంది. అయితే, లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే.. జాన్వీ కపూర్ ను తీసుకోబోతున్నారు. ఆమెది కేవలం గ్లామర్ డాల్ పాత్ర అని.. కంటెంట్ ఉన్న పాత్ర మాత్రం వర్ష బొల్లమ్మ ది అని తెలుస్తోంది. ఇటీవల ఆమెపై ఫోటోషూట్ చేశారు. ఏ విషయం రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది. రీసెంట్ గా స్వాతి ముత్యం వంటి విజయంతో మళ్లీ వెలుగులోకి వచ్చిన వర్ష బొల్లమ్మ కి, ఈ సినిమా వస్తే.. ఆమె కెరీర్ మరో స్థాయికి వెళ్ళినట్టే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -