రౌడీ నెంబర్‌.150 గా వర్మ..

216
varma
- Advertisement -

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు వర్మపై..నాగబాబు చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన వర్మ గత రాత్రి నుంచి తనదైన స్టైల్లో ట్వీట్లర్ అస్త్రంగా కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే నాగబాబుపై పలు వ్యాఖ్యలు చేసిన వర్మ..తాజాగా మరో ట్వీట్ చేశాడు. చిరంజీవి కుటుంబానికి పవన్ కల్యాణ్, రాంచరణ్, సాయి ధరమ్, వరుణ్, బన్నీ వంటి సానుకూలతలను ఇచ్చిన దేవుడు… బ్యాలెన్స్ కోసం నాగబాబు గారిని ఇచ్చాడు” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పలువురు ప్రముఖులు పెట్టిన కోట్స్ ను ప్రస్తావించాడు. “గాజు అద్దాల్లో నివసిస్తున్న వారు ఇతరులపై రాళ్లు విసరకూడదు – భగవద్గీత”, “జీవితంలో విఫలమైన వాళ్లు ఇతరులను విమర్శించడం అంటే, తుపాను ముందు నోటితో గాలిని ఊదినట్టే – ఫ్రాంక్లిన్ ఫోయర్” అని ట్వీట్లు పెట్టాడు.

varma

నాగబాబును ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసిన వర్మ అంతటితో ఆగకా ఓఫోటోను పోస్ట్ చేశాడు. అందులో చిరంజీవి ఖైదీ నెంబర్ 150కి ధీటుగా..వర్మఫోటోతో రౌడీ నెంబర్ 150 అనే పోస్టర్‌ ఉంది. ఆ పోస్టర్ లో వర్మ కాలు మీద కాలు వేసుకుని కూర్చీలో కూర్చున్నాడు. అయితే ఇది చిరంజీవి అభిమాని ఒకరు ‘రౌడీ నంబర్ 150’ అంటూ తనపై తయారు చేసిన పోస్టరును షేర్ చేశాడని తెలిపాడు వర్మ. నాగబాబు వర్సెస్‌ వర్మగా మారిన ఈ వివాదం వారి అభిమానుల్లోకి కూడా పాకిపోయింది. ఇరువురు ఆన్‌లైన్‌ వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెలుతుందో చూడాలి.

- Advertisement -