ప్రధాని మోదీతో అజిత్‌ దోవల్‌ కీలక భేటీ

11
- Advertisement -

జమ్మూ కశ్మీర్‌లోని పెహల్‌గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సమావేశం కానున్నారు. ఉగ్రదాడి అనంతరం భద్రతా దళాలు తీసుకుంటున్న చర్యలను మోదీకి వివరించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ రెచ్చగొట్టే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్‌ జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి మరోసారి తుపాకులతో కవ్వింపులకు పాల్పడింది.

ఆదివారం అర్ధరాత్రి వేళ కుప్వారా జిల్లాలోని కేరన్‌ సెక్టార్‌లో, పూంచ్‌ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడింది. వీటికి భద్రతా బలగాలు తక్షణమే స్పందించి దాడులను తిప్పికొట్టాయి.

Also Read:TTD:మే 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

- Advertisement -