చిన్నమ్మపై రామ్ గోపాల్ వర్మ సినిమా..

250
Shasikala
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సంచనాత్మంగా ఉండాలని చూస్తాడు. ఉండడమే కాదు అలాంటి పనులే చేస్తాడు వర్మ. సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందిస్తూ…వాటినే సినిమా రూపంలో తెరకెక్కించే మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు. తన తదుపరి సినిమా పేరు ‘శశికళ’ అంటూ పెద్ద బాంబు పేల్చాడు. శశికళ’ పేరుతో తన తర్వాతి సినిమా తెరకెక్కించనున్నట్లు స్వయంగా వర్మానే ట్వీట్టర్ వేదికగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ‘శశికళ’ పేరును రిజిస్టర్‌ చేసుకొచ్చినట్లు ట్వీట్‌ చేశారు. ఈ కథ ఓ రాజకీయవేత్తకు చాలా దగ్గరైన, ప్రియమైన స్నేహితురాలిదే అయినా పూర్తి కల్పితం అని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే నాకు చాలా గౌరవమని..కానీ శశికళ అంటే ఆమెకన్నా ఎక్కువ గౌరవమని అన్నారు.

Shasikala

జయలలిత అందరికన్నా ఎక్కువగా శశికళను గౌరవించేవారన్న విషయమే తన చిత్రానికి ‘శశికళ’ అని పేరు పెట్టడానికి కారణమన్నారు. శశికళ కళ్లతో జయలలితను చూడటం.. జయలలిత కళ్లతో జయలలితను చూడటం కన్నా కవితాత్మకంగా ఉంటుందని చెప్పారు. జయ మరణంతో తమిళ రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. అమ్మ పోయి చిన్నమ్మ వచ్చింది. మొన్నటిదాకా జయ కాళ్లకు మొక్కిన వారు, ఇప్పుడు శశికళ కాళ్లకు మొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో, వర్మ ‘శశికళ’ సినిమా ఎన్ని ఉద్రిక్తతలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Shasikala

జయలలితకు అప్తమిత్రులుగా ఉన్న శశికళ అసలు జయకు ఎలా దగ్గరైయ్యారు. చిన్నమ్మ ప్రస్తానమేంటి..జయలలిత తర్వాత అన్నాడీఎంకే నెక్ట్స్ వారసురాలిగా ఎలా ఎదిగారు..అనే కోణంలో సినిమా ఉండబోతున్నట్టు..ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. వంగవీటి..నయీం సినిమాలతో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన వర్మ శశికళ సినిమాను ప్రకటించి మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇదిలా ఉంటే విజయవాడలో జరిగిన ముఠా గొడవల ఆధారంగా వర్మ తెరకెక్కించిన ‘వంగవీటి’ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

- Advertisement -