మోడీని కడిగిపారేసిన బుడ్డోడు..!

235
Kid Fire On PM Narendra Modi For Note Banned
- Advertisement -

పెద్ద నోట్ల రద్దుతో భారతావని క్యూలో నిలబడింది. పెద్ద నోట్లు రద్దు చేసి 40 రోజులు గడుస్తున్న సామాన్యుల కష్టాలు తీరటం లేదు. రోజురోజుకు బ్యాంకుల ముందు క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి. ప్రజల గంటల తరబడి క్యూలో నిల్చున్న డబ్బులు దొరకని పరిస్థితి నెలకొంది. ఓ వైపు క్యూలైన్లో నిలబడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. మరోవైపు బ్యాంకుల్లో రెండు వేల రూపాయల తీసుకున్న చిల్లర దొరకని పరిస్థితి నెలకొంది. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అరికట్టడం సంగతి ఏమో కానీ ప్రజలకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.

చాలావరకు ఏటీఎంలు పనిచేయడం లేదు. కొన్ని సందర్భాల్లో ఎంతసేపు క్యూలో నిలుచున్నా.. డబ్బులు లేవని బ్యాంకులు తిప్పిపంపుతున్న సందర్భాలూ ఉన్నాయి. డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు లేనివాళ్ల పరిస్థితి కనాకష్టంగా ఉంది. నోట్ల రద్దుపై సామాన్యుల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. మోడీ నిర్ణయంపై సెటైర్లు వేస్తు నెటిజన్లు తమ వీడియోలు,కామెంట్లను పోస్టు చేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ బుడ్డోడి వీడియో హల్‌చల్‌ చేస్తోంది. బుజ్జీబుజ్జీ మాటలతో సామాన్యుల పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ మోడీని ఈ బుడ్డోడు కడిగిపారేశాడు. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి మాటలు అందిస్తుండగా.. వాటిని పొల్లుపోకుండా స్వచ్ఛమైన హావభావాలతో ఈ బుడ్డోడి చెప్పిన తీరు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఆ వీడియో మీ కోసం..

https://youtu.be/V08KtCqvq5Q

- Advertisement -