రణబీర్‌ ఇంటికి కింగ్ ఖాన్ భార్య డిజైన్

174
Gauri Khan turns interior designer

బాలీవుడ్‌ యువ హీరో రణబీర్‌ కపూర్‌ ఇటీవల కొత్త ఇంట్లోకి వెళ్లాడు. ముంబై శివారు పాలి హిల్స్‌లో రణబీర్‌ ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు. బుధవారం రాత్రి రణబీర్‌ బాలీవుడ్‌ ప్రముఖులకు విందు ఇచ్చాడు. ఈ పార్టీకి దర్శకుడు కరణ్‌ జోహార్‌, గౌరీ ఖాన్‌ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

షారూక్ ఖాన్ భార్యగా.. నిర్మాతగా గౌరీ ఖాన్ పేరు అందరికీ పరిచితమే. గౌరీ ఖాన్‌ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ఎక్స్ పర్ట్. ఇంటీరయర్ డిజైనింగ్ లో షారూక్ వైఫ్ చాలా ఇంటెన్సిటీతో వర్క్ చేస్తుందనే టాక్ ఉంది. అందుకు తగ్గట్లుగానే ఆమె టేకప్ చేసే ప్రాజెక్టులు కూడా ఉంటాయి. రీసెంట్ గా రణబీర్ కపూర్ కొత్తింటికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ ను గౌరీ ఖాన్ హ్యాండిల్ చేసింది.

రణబీర్ టేస్ట్ కి తగినట్లుగాను.. దానికి తనదైన టచ్ ఇస్తూ ఇంటీరియర్ డెకరేటింగ్ చేసినందుకు.. గౌరీ ఖాన్ ఛార్జ్ చేసిన మొత్తం ఎంతో తెలుసా.. 35 కోట్ల రూపాయలు. రణబీర్‌ అపార్ట్‌మెంట్‌లో అతనితో కలసి దిగిన ఫోటోను గౌరీ ఖాన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Gauri Khan turns interior designer

రణబీర్‌ కొత్త ఇంటిని అందంగా తీర్చిదిద్దినందుకు అతని తల్లిదండ్రులు నీతూ కపూర్‌, రిషి కపూర్‌లు.. గౌరీ ఖాన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. రణబీర్‌ కుటుంబం చెంబూరులోని కపూర్‌ కాటేజ్‌లో ఉంటోంది. రణబీర్‌ కూడా తన బామ్మ కృష్ణరాజ్‌ కపూర్‌తో కలసి అక్కడే ఉండేవాడు. ఓ స్టార్ వైఫ్ గా కాకుండా తన సొంత ట్యాలెంట్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకుంటున్న గౌరీ ఖాన్ ని చూసి షారూఖ్ ఖాన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

Gauri Khan turns interior designer