తమిళంలో ఫస్ట్ సినిమా…

9
- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో నటనతో తనదైన ముద్ర వేసుకున్న శ్రీకాంత్ తొలిసారి తమిళంలో కనిపించబోతున్నారు. అవును ఇదీ నిజం దాదాపుగా 100సినిమాల్లో నటించిన శ్రీకాంత్‌ తొలిసారి వారిసు సినిమాలో ప్రత్యేక క్యారెక్టర్ చేయనున్నట్టు తెలిపారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో తమిళ్‌లో వరిసు పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.

వారసుడు సినిమా ప్రమోషన్‌లో భాగంగా శ్రీకాంత్ మాట్లాడుతూ…వారసుడు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని అన్నారు. ఇందులో తన పాత్ర ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలిపారు. అయితే తాను ఇప్పటివరకు తమిళంలో ఒక సినిమా కూడా చేయలేదని…మంచి కథలు రాకపోవడమే అందుకు కారణమని అన్నారు. ఇది సంక్రాంతి పండగకి ఒక పండగలాంటి సినిమా రాబోతుంది అఖండ తర్వాత ఈ సినిమాలో మంచి పాత్ర చేశానని తృప్తి కలిగేలా ఉందన్నారు. ఈ సినిమాతోనే కాదు భవిష్యత్‌లో మరిన్ని సినిమాలో విలన్ పాత్రలు పోషించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

కామెడీలో వీరయ్య వీరత్వం

హెబ్బా పటేల్‌ అందాల విందు…

సమంత కు అమ్మలా.. రష్మిక !

- Advertisement -