ట్రైలర్ తేడా కొట్టిందే

86
- Advertisement -

సంక్రాంతి రేస్ లో నిలిచిన ‘వారసుడు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. విజయ్ తో వంశీ పైడిపల్లి తీస్తున్న ఈ సినిమాపై తెలుగులో కూడా ఓ మోస్తారు ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ మాత్రం ఆడియన్స్ ను నిరాశ పరిచి, ట్రోలింగ్ కి గురైంది. వారసుడు కోసం తెలుగులో ఇప్పటికే వచ్చిన చాలా సినిమాల్లో కథనే వంశీ తీసుకోవడం అందరినీ డిస్సపాయింట్ చేసింది.

ఒక ఉమ్మడి కుటుంబం, ఇంటి పెద్దకి వ్యాపార సమస్య , కుటుంబం నుండి ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోవడం , ఆ టైమ్ లో తన కుటుంబంలో వచ్చిన అన్నీ సమస్యలను హీరో ఎలా సెట్ చేశాడు ? ఈ లైన్ తో తెలుగులో లక్ష్మీ నుండి ‘అల వైకుంఠ పురం’ వరకూ చాలానే సినిమాలు వచ్చాయి. వారసుడు ట్రైలర్ లో కూడా ఇదే కథ కనిపిస్తుంది.

ట్రైలర్ వారసుడు రొటీన్ స్టోరీ తో రాబోతున్న సినిమా అంటూ హింట్ ఇవ్వడంతో నెటిజన్లు వారసుడు సినిమాను గట్టిగా ట్రోలింగ్ చేస్తున్నారు. అన్నీ కలిపి విజయ్ తో వంశీ ఈ సినిమా తీశాడాని దర్శకుడ్ని అలాగే ఈ సినిమాపై ఎక్కువ చెప్తున్న దిల్ రాజు ను ట్రోల్ చేస్తూ మీమ్స్ , వీడియోలు వదులుతున్నారు. ఏదేమైనా సినిమా పై అంచనాలు పెంచాల్సిన ట్రైలర్ వారసుడు మీద ఉన్న కాసిన్ని అంచనాలను కూడా తుడిచేసింది. మరి ఈ రొటీన్ కథను వంశీ తన స్టైల్ లో ఎలా డీల్ చేశాడో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -