అనసూయ పూజలు.. వైరల్‌ అవుతోన్న ఫోటో

36
- Advertisement -

అనసూయ భరద్వాజ్‌… యాంకర్‌ గా, నటిగా మనకు ఎంత సుపరిచితురాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలతో దూకుడుమీదున్న అనసూయ సోషల్‌ మీడియాలో సైతం యాక్టివ్‌ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిత్యం ఫోటో షూట్లు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు అనసూయ. అయితే ఇప్పుడు అనసూయ తన ఇన్‌స్ట్రాగ్రమ్‌ పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. తాజాగా అనసూయ పూజలు చేస్తూ షేర్‌ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుందనే చెప్పాలి.

శ్రీకాళహాస్తి వెళ్లిన అనసూయ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేస్తూ దిగిన పోటోపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. సహజంగా శ్రీకాళహస్తిలో దోషనివారణ పూజలు చేస్తారన్న టాక్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు సెలెబ్రీటీలు శ్రీకాళహస్తిలో దోషనివారణ పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కోణంలోనే అనసూయ కూడా శ్రీకాళహస్తిలో దోషనివారణ పూజలు చేసిందా అన్న చర్చ కూడా జరుగుతోంది. నూతన సంవత్సరంలో తనకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ అనసూయ శ్రీకాళహస్తిలో పూజలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పూజలో అనసూయను చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నిత్యం గ్లామర్‌తో అందాలను ఆరబోసే అసనూయ పూజలో చీరకట్టు అందాలతో మతిపోగోడుతోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి 

పవన్‌ కళ్యాణ్‌ సరసన శ్రీలీల?

త్వరలో శర్వానంద్‌ పెళ్లి?

అనసూయ పూజలు.. వైరల్‌ అవుతోన్న ఫోటో

- Advertisement -