సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు:మేయర్ బొంతు

521
bonthu rammohan
- Advertisement -

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ప్రజలకు మెరుగైనా పౌర సేవలను అందించుటకు ప్రత్యేక ఐ టి యాప్‌లను వినియోగిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా అమలుచేస్తున్న కార్యక్రమాల గురించి అధ్యయనం చేసేందుకు ప్రధానమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి కార్పొరేషన్ కు చెందిన 23 మంది సీనియర్ అధికారుల బృందం 5 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం హైదరాబాద్ చేరుకున్నది.

మొదటగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం లో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఐ టి. విభాగం అదనపు కమీషనర్ సిక్తా పట్నాయక్, ఆస్కి డైరెక్టర్ శ్రీనివాస చారి లతో సమావేశమైంది.

పరిజ్ఞానం వినియోగంతో ఈ-ఆఫీస్,ఆస్తుల మ్యాపింగ్, వీధి లైట్ల నిర్వహణ, గ్రీవెన్స్, మొబైల్ యాప్, వాహనాల రద్దీ, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొందుకు లక్ష సిసి కెమెరాల ద్వారా మోనిటరింగ్, అన్ని శాఖలతో సమన్వయము, ఇంటింటి నుండి చెత్త సేకరణ, రవాణా,తదితర అంశాలు గురించి పవర్ పాయింట్ ప్రెజెన్టేషన్ ద్వారా వివరించారు.

Construction and demolition waste has a new destination. Inspected the soon-to-be inaugurated C&D waste recycling plant at Jeedimetla

- Advertisement -