రాష్ట్ర ప్రజల ఆకాంక్ష 29న నెరవేరబోతుంది: వంటేరు

228
Vanteru Pratap Reddy

సిద్దిపేట జిల్లా : నిన్న రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ కాల్ సూచన మేరకు చేబర్తి చెరువుకు తుం ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్ట్ 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,సర్పంచ్ అశోక్ లు, ఈ నేపథ్యంలో మహిళలు,ప్రజాప్రతినిధులు భారీగా బోనాలతో తరలివచ్చారు.

ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజల ఆకాంక్ష 29 తారీకుతో నెరవేరబోతుంది, కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్ ప్రారంభం కాబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలయిందే నీళ్ల కొరకు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చినందుకు కేసీఆర్‌కు పాదాభివందనం అని వంటేరు అన్నారు.

గతంలో సరైన సమయంలో వర్షాలు పడక రైతులు నష్టపోయేవారు, ఇక ఆ పరిస్థితి రాష్ట్రానికి లేదు. ఎక్కడైనా వంపుకు ఉన్న ప్రాంతానికి నీళ్లు వస్తాయి కానీ కేసీఆర్ కృషి వల్ల ఎత్తుకు నీటిని తరలించుకున్నాం. మన జన్మలో సాధ్యమవుతుంద అని అనుకున్న అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారు మన కేసీఆర్ సార్ అని తెలిపారు.

సీఎం కేసీఆర్‌ సార్ ఫోన్ చేసి మీ చెరువు నింపుతాం అని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామం తరుపున కేసీఆర్ కు  కృతజ్ఞతలు తెలిపుతున్నామని చేబర్తి గ్రామ సర్పంచ్ అశోక్ అన్నారు.