సిద్ధిపేట జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటీవ్..

20
corona

సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావ్ పేటలో ఇద్దరికి కరోనా పాజిటీవ్ గుర్తించారు అధికారులు. ఇటీవల ముంబాయి నుండి వెంకట్రావు పేటకు వచ్చిన ఐదుగురు కుటుంబ సభ్యులు..వారిలో భార్య భర్త లకు కరోనా పాజిటీవ్ అని తెలడంతో ఇద్దరినీ చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

వెంకట్రావు పేటను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించి కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను, వైద్య శాఖ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.అప్రమత్తమైన అధికారులు వెంటనే వెంకట్రావు పేటను కంటైన్ మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య శాఖ అధికారి నేతృత్వంలో వెంకట్రావు పేటలో 12 ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేశారు.

ఈ ప్రత్యేక వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. వెంకట్రావు పేట నుండి ఎవరూ బయటకు వెళ్లవద్దని..ఇతరులేవరూ 14 రోజులు గ్రామంలోకి రావొద్దని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. జలుబు, దగ్గు,జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ లకు సమాచారం ఇవ్వాలని.. గ్రామస్థులందరూ ఇండ్లల్లోనే ఉండాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలో వెంకట్రావుపేట గ్రామాన్ని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సందర్శించారు. గ్రామానికి చెందిన ఇద్దరు భార్య భర్తలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యబృందంతో కలిసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎవ్వరు భయపడవద్దు, ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.