భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్ ప్రాజెక్ట్‌ను 2019లో అందుబాటులోకి తెచ్చింది. తొలుత న్యూఢిల్లీ – వారణాసి మార్గంలో ఈ రైలును ప్రారంభించింది మోదీ సర్కార్. 140 కోట్ల మంది కలగిన ఈ దేశంలో ఇటువంటి రైళ్లను ప్రవేశపెడితే భవిష్యత్త్‌లో ప్రధాన నగరాల మధ్య దూరం తగ్గి…సమయపాలన కలసి వస్తోందని మోదీ సర్కార్ భావిస్తోంది.
అందుకే వచ్చే మూడేళ్లలో దేశంలోని వివిధ మార్గాల్లో మొత్తం 400 వందే భారత్ రైల్లను ప్రారంభించాలని మోదీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. పూర్తిగా స్వదేశి పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ వందేభారత్ రైల్లను తాజాగా దక్షిణాదికి కూడా విస్తరింపజేస్తుంది.
చెన్నై-మైసూర్ వందేభారత్ ట్రయల్ రన్ చెన్నైలోని ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో సోమవారం ప్రారంభమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ దక్షిణాదిన తొలిసారిగా నవంబర్ 11న పట్టాలెక్కనుంది.
ఈ ట్రైన్‌లో మొత్తం 16 కోచ్‌లు ఆటోమేటిక్ డోర్స్‌తో పాటు జీపీఎస్ ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కలిగి ఉంటాయి. వినోదం కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ వైఫై, కమ్‌ఫర్ట్‌బుల్ సీటింగ్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో కూడా రొటేటింగ్ ఛైర్స్ అమర్చారు. ఈ ట్రైన్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి బెంగళూర్ సిటీ జంక్షన్ మీదుగా తుది గమ్యస్ధానం మైసూర్‌కు చేరుకుంటుంది. మొత్తం 497 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ 6 గంటల 40 నిమిషాల్లో చేరుకుంటుంది.
ఇవి కూడా చదవండి..