అత్యాధునిక హంగులతో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

307
budget
- Advertisement -

గో సంరక్షణ కోసం ప్రత్యేక రూ. 750 కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటుచేశామన్నారు కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్. మత్య్స,పారిశ్రామిక రైతులకు తక్కువ శాతం వడ్డీకే రుణాలు అందిస్తామన్నారు. విపత్తులతో నష్టపోయిన రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేస్తామన్నారు. 39 సంవత్సరాలు దాటిన వారు నెలకు రూ. 100 పెన్షన్ జమ చేస్తే ప్రభుత్వం అంతేమొత్తంలో జమ చేస్తుందన్నారు. గోసంరక్షణ కోసం ఎలాంటి చర్యలనైనా తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు.

సకాలంలో రుణాలు చెల్లిస్తే మరో మూడు శాతం రాయితీ కల్పిస్తామన్నారు.18 ఏళ్లు దాటిన వారు నెలకు రూ.55 జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం అంతేమొత్తంలో జమ చేస్తుందన్నారు.ఈఎస్‌ఐ పరిమితి 21 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. జీడీపీలో 42 శాతం శ్రామికుల నుండే వస్తుందన్నారు.

అన్ని రాష్ట్రాల్లో ఎయిమ్స్‌ నిర్మిస్తున్నామని చెప్పారు. 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ. 3వేల పించన్ అందిస్తామన్నారు.ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ద్వారా 6 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు అందించామని తెలిపారు. ఉడాన్ పథకంలో భాగంగా 100 ఎయిర్ పోర్టులు నిర్మిస్తున్నామన్నారు.239 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తెచ్చామన్నారు.

సైనికుల కోసం ఓఆర్ఓపీ పథకాన్ని తీసుకొచ్చామని ఇందుకోసం రూ. 35 వేల కోట్లు కేటాయించామన్నారు. ఐదేళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 10 రేట్లు పెరిగిందన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి పెద్దపీట వేశామన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో పట్టాలెక్కబోతుందని చెప్పారు.

- Advertisement -