మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా వాల్మీకి. ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని 14రీల్స్ బ్యానర్ సంస్ధ నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.
తాజాగా వాల్మీకి సినిమా మరో వివాదంలో ఇరుక్కుంది. ఈసినిమా టైటిల్ మార్చాలంటూ బోయ హక్కుల సమితి నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘వాల్మీకి’ టైటిల్ బోయలను కించపరిచేలా ఉందని, ఈ చిత్రానికి పేరు మార్చేలా హైకోర్టు చర్యలు తీసుకోవాలని బోయ హక్కుల సమితి నేతలు తమ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ జరపనుంది. ఈవివాదంపై చిత్రయూనిట్ ఇంత వరకు స్పందించలేదు. ఇటివలే విడుదలైన ఈచిత్ర టీజర్ కు మంచి స్పందన వస్తోంది. తమిళ్ సినిమా జిగర్తాండకు రీమేక్ గా తెరకెక్కించాడు. తమిళంలో సిద్ధార్ధ్, బాబీ సింహాలు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో తమిళ హీరో అథర్వ, వరుణ్ తేజ్ యాక్ట్ చేసాడు.