లవర్స్ డే స్పెషల్.. లక్ష మందికి భోజనం

247
ghmc feed the need
- Advertisement -

లవర్స్ డే సందర్భంగా జీహెచ్‌ఎంసీ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఫీడ్‌ ద నీడ్ పేరిట లక్ష మందికి ఉచితంగా భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు మేయర్ బొంతు రామ్మోహన్‌.

ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించేందుకు పలు హోటల్ యజమానులు, స్వచ్చంద సంస్థలు, ఇతరులు ముందుకొచ్చారు. దీనికి తోడు 40 వేల మందికి ఆహారం అందించేందుకు దాతలు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆహారాన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండులు, ఆటో స్టాండులు, స్లమ్‌లు, మేజర్ ఆసుపత్రులు ఇతర రద్దీ ప్రాంతాల్లో ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్చంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అడిషనల్ కమిషనర్ హరిచందన వెల్లడించారు.

స్వరాష్ట్రంలో పాలనలో ప్రజల మన్ననలు పొందుతున్న జీహెచ్‌ఎంసీ స్వచ్ఛతలోనూ దేశంలోని మిగితా మెట్రోపాలిటిన్‌ సిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా తిండిలేక ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. వృధాగా పడేసే ఆహార పదార్థాలను ఇతరులకు అందించడం ద్వారా ఆకలితో పస్తులుండే వారి కడుపులు నింపే కార్యక్రమమే ఫీడ్ ద నీడ్ అని అధికారులు చెబుతున్నారు. ఎన్జీవోల సహకారాంతో ప్రజల్లో మరింత అవగాహన తీసుకువచ్చేలా జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.

- Advertisement -