వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్..!

120
nithin
- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో నితిన్. ప్రస్తుతం ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా చేస్తుండగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు నితిన్.

రీసెంట్‌గా అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య సినిమాను తెరకెక్కించగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా నితిన్‌తో రెండవ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు వంశీ. ఈ సినిమాకి ‘జూనియర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఠాగూర్ మధు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనుండగా త్వరలో వివరాలను వెల్లడించనున్నారు.

- Advertisement -