బీసీ బిల్లుపై కేంద్రం చిత్తశుద్ది ఏదీ?:శ్రీహరి

8
- Advertisement -

కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లును క్లియర్ చేయండి అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బీసీలు కాకపోయినా శాస్త్రీయంగా కులగణన చేసి ముందుకెళ్తున్నారు అన్నారు.

తెలంగాణలో ముస్లింలను పక్కనబెడితే బీసీ బిల్లుకు మద్దతు ఇస్తామని బీజేపీ నేతలు అంటున్నారు… గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలను ఎందుకు పక్కనబెట్టడం లేదు?, తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎందుకంత బాధ? చెప్పాలని డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్ చేర్చే వరకూ పోరాటం ఆగదు అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం అన్నారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన బీసీ పోరుకు బీసీ సంఘాలు, ఎన్జీవో సంఘాలు కూడా మద్దతు తెలిపాయి అని తెలిపారు ఆది శ్రీనివాస్.

Also Read:భారత్‌పై ట్రంప్ మరో బాంబ్..!

- Advertisement -