పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదలైంది.
నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో ఉన్న ఈ పోస్టర్ అలరిస్తోంది. వారు ముగ్గురు తన వెనక నిలబడగా మహిళలను కాపాడే అడ్వకేట్ లా పవన్ కల్యాణ్ కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఓ చేతిలో బేస్ బాల్ బ్యాట్, మరో చేతిలో న్యాయశాస్త్ర పుస్తకం పట్టుకుని సీరియస్ లుక్‌లో కనపడుతున్నారు. గత ఏడాది మార్చి 8న కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ‘మగువా.. మగువా’ అనే పాట విడుదలైన విషయం తెలిసిందే.