మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన ఎమ్మెల్సీ క‌విత

42

మ‌హిళ‌లు ఒక్కటిగా ఉంటే.. వారి శ‌క్తి అన‌న్య‌సామ‌న్య‌మైంద‌న్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత. ఈరోజు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా ఆమె ట్విట్టర్‌ ద్వారా మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త్‌లోనూ, ప్ర‌పంచంలోనూ మ‌హిళ‌లు ఎంతో దూరం ప్ర‌యాణించార‌ని, ఎన్నో తిరోగ‌మ‌న పద్దతుల‌కు వ్య‌తిరేకంగా నిలిచామ‌ని, స‌రైన హ‌క్కు కోసం పోరాటం చేశామ‌ని, త‌ద్వారా జీవ‌న గ‌మ‌నాన్ని ఎంచుకున్నామ‌ని అన్నారు.

మ‌హిళ‌లు, పురుషులంద‌రికీ మ‌హిళా దినోత్స‌వం శుభాకాంక్ష‌లు తెలిపారు. అంతకుముందు వేంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నే కవిత ఆధ్వర్యంలో స్థానిక మహిళలతో కలిసి మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఈ సందర్భంగా వారంతా కేక కట్ చేశారు.