వకీల్ సాబ్‌…సంక్రాంతి ట్రీట్!

37
vakeel saab

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వకీల్ సాబ్. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల తర్వాత తిరిగి వెండితెరపై పవన్ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది.

సంక్రాంతి కానుకగా వకీల్ సాబ్ ఫస్ట్ టీజర్‌ని జనవరి 14న సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. హిందీలో వచ్చిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.