కొత్త ఇంట్లోకి మోనాల్..ఎక్కడో తెలుసా!

43
monal

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4లో హాట్ టాపిక్‌గా మారిన బ్యూటీ మోనాల్. చివరి వరకు తనదైన శైలీలో బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన మోనాల్‌ కెరీర్ మలుపు తిరిగిపోయింది. పలు ఆఫర్లు ఈ అమ్మడికి వస్తుండటంతో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఇల్లు కొనే ఆలోచనలో ఉందట. తనకు ఎంతో గుర్తింపు ఇచ్చిన టాలీవుడ్‌లోనే పాగా వేసేందుకు ప్రయత్నిస్తానని చెబుతున్న మెనాల్…హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తుందని టీ టౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం మోనాల్‌ మా టీవీలో డ్యాన్స్‌ షోకి జడ్జిగా వ్యవహరిస్తుండగా పలు టాలీవుడ్,బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా ఉంది.