సాగర్‌ ఎన్నికల తర్వాతే పీసీసీ చీఫ్ నియామకం!

23
manikam tagore

టీపీసీసీ చీఫ్ నియామకంపై క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్. పీసీసీ నియామకాన్ని వాయిదా వేసుకోవాలన్న సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా వేసినట్లు తెలిపారు.

నాగార్జునసాగర్ ఉపఎన్నికల తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం పూర్తిస్థాయి జట్టును ప్రకటిస్తామని.. పిసిసి, ప్రచార కమిటీతో సహా అన్ని కమిటీలు ఉంటాయని వెల్లడించారు. పీసీసీ సంప్రదింపుల ప్రకియ ఇంకా పూర్తి కాలేదన్నారు.

తెలంగాణలో రెండు దశాబ్దాలకు పైగా బీసీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు ఇచ్చిందని గుర్తుచేసిన ఆయన.. ఆ బీసీ నాయకులంతా పార్టీని వీడిపోయారు అది వాళ్ల నిబద్దత అంటూ మండిపడ్డారు.