పవన్‌..వకీల్ సాబ్ స్టిల్ లీక్!

1303
pawan
- Advertisement -

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వకీల్ సాబ్. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల తర్వాత తిరిగి వెండితెరపై పవన్ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.

అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త పడింది చిత్రయూనిట్. అయితే తాజాగా వకీల్ సాబ్‌కు లీకుల బెడద తప్పలేదు. చిత్రంలోని కోర్టు సీన్‌కి సంబంధించిన పిక్ ఒక‌టి లీక్ అయింది.

లీక్ అయిన పిక్ కోర్ట్ రూం సన్నివేశం కాగా, ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌డ్జితో మాట్లాడుతున్న‌ట్టుగా ఉంది. పవన్ సరసన నివేదాథామస్ హీరోయిన్‌గా నటిస్తుండగా అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -