వకీల్ సాబ్…వైరల్ పిక్‌!

44
vakeel saab

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ – వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. ఇటీవలె పవన్ కల్యాణ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తికాగా తాజాగా సినిమా షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు. పవన్ సరసన శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా నివేదా థామస్,అంజలి,అనన్య నాగెళ్ల ప్రధాన పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌కు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టిల్స్‌ను బట్టి చూస్తే సినిమాలో చాలా మార్పులు చేశారని అర్ధమవుతుంది. ఈ ఏడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో ‘వకీల్ సాబ్’ కూడా నిలిచింది.త్వరలోనే టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు.

తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. మామిడాల తిరుపతి మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రవి వర్మ యాక్షన్ డైరెక్టర్.