వేస‌వి‌లో వస్తున్న ‘వ‌కీల్ సాబ్‌’..

157
pawan
- Advertisement -

ఈ వేస‌వి కాలంలో టాలీవుడ్ ప్రేక్ష‌కులు పెద్ద పండుగ‌ను చేసుకోబోతున్నారు. వ‌రుస‌గా పెద్ద హీరోల సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సినిమాల విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ‘వ‌కీల్ సాబ్‌’ సినిమా విడుద‌ల తేదీని సినిమా బృందం ప్ర‌కటించింది. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న వ‌కీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది.

ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా న‌టిస్తోంది. అంతేగాక‌, ఇందులో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ల ప్ర‌ధాన‌ పాత్రల్లో క‌న‌ప‌డ‌నున్నారు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన కొత్త‌ పోస్టర్‌లో ఎర్ర కండువా, ర‌క్త‌పు మ‌ర‌కల‌ చొక్కాతో ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌న‌ప‌డుతూ త‌న ఉగ్ర‌రూపాన్ని చూపాడు.

- Advertisement -