వాజ్‌పేయి ఆరోగ్యం విషమం..

234
- Advertisement -

బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కిడ్నీ, వృద్ధాప్య సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బుధవారంనాడు క్షీణించడంతో పార్టీ అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఎయిమ్స్ చేరుకుంటున్నట్టు పార్టీ వర్గాలు సమాచారం.

Atal Bihari Vajpayee

ఈ రోజు ఉదయమే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు. వాజ్‌పేయికి అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఆయనను ఇప్పటికే పరామర్శించి వచ్చారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి జూన్ 12న ఆస్పత్రిలో చేరారు.

- Advertisement -