ఆ ఇద్దరితో ‘బేబీ’ బ్యూటీ రొమాన్స్

15
- Advertisement -

బేబీ సినిమాతో హీరోయిన్‌ గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన వైష్ణ‌వి చైత‌న్య‌ న‌ట‌నకు ప్రేక్ష‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లందాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం వైష్ణ‌వికి దిల్ రాజు బ్యాన‌ర్‌లో నటించే అవ‌కాశం ద‌క్కింద‌ని తెలుస్తోంది. రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన ఆశిష్ న‌టిస్తున్న కొత్త సినిమాలో అరుణ్ భీమ‌వ‌రపు ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వి చైత‌న్య‌ న‌టించ‌బోతుంది. ఈ సినిమాతో పాటు వైష్ణ‌వి ఖాతాలో మరో క్రేజీ సినిమా కూడా చేరింది. సిద్దూ జొన్న‌లగడ్డ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో వైష్ణ‌వి చైత‌న్య‌ హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.

ప్ర‌స్తుతం టిల్లూ స్వ్కేర్ సినిమాతో బిజీగా ఉన్న‌ సిద్దూ జొన్న‌లగడ్డ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌లో ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో సిద్దూకి జోడీగా మొదట కృతి శెట్టిని అనుకున్నారు. కానీ, బేబీ మూవీ అద్భుత విజయం సాధించడంతో ‘కృతి శెట్టి’ ప్లేస్ లోకి ‘వైష్ణ‌వి చైతన్య’ ని తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఏది ఏమైనా టిల్లూ బాయ్‌తో రొమాన్స్ చేయ‌డానికి బేబీ బ్యూటీ రెడీ కాబోతుంది.

దిల్ రాజు బ్యాన‌ర్‌లో రాబోతున్న సినిమాలో కూడా వైష్ణ‌వి చైత‌న్య‌ చాలా బోల్డ్ గా కనిపించబోతుంది. ఇక సిద్దూ జొన్న‌లగడ్డ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఘాటు ముద్దులు దగ్గర నుంచి మోటు సాంగ్స్ అండ్ డైలాగ్స్ వరకూ అన్నీ పీక్స్ లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే వైష్ణ‌వి చైత‌న్య‌ కూడా తన గ్లామర్ ను ఒలకబోయడానికి ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. తన హాట్ హాట్ అందాలతో విధ్వంసం సృష్టించి.. స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోవాలని వైష్ణ‌వి చైత‌న్య‌ ఇప్పటి నుంచే లోదుస్తుల్లో కనిపించేలా పలచని వస్త్రాలను అలవాటు చేసుకుంటుంది. మరి భవిష్యత్తులో ఈ పాప ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో చూడాలి.

Also Read:బీజేపీలో ఉండలేకపోతున్నారా?

- Advertisement -