మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడుగా టాలీవుడ్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కొండ పొలం’.ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వైష్టవ్‌తో రొమాన్స్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో రకుల్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్, వీడియో షేర్ చేశారు మేకర్స్. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది.. కానీ.. కరోనా వ్యాప్తి కారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది. ఈ సినిమాను, ‘కొండ పొలం’ అనే నవల ఆధారంగా రూపొందించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్లకు .. లిరికల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 3:33 నిమిషాలకు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. కొండప్రాంతం .. గిరిజన గూడెంలోని జీవన విధానం .. అక్కడ ఉన్న సమస్యలను కలుపుకుని సాగే అందమైన ప్రేమకథ ఈ సినిమా. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.