రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు..

58

ఐపీఎల్ 2021లో భాగంగా ఈరోజు అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్.. తలపడగా రాజస్థాన్ ఓటమిపాలైంది. ఢిల్లీ చేతిలో 33 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. 53 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 1 సిక్స్, 8 ఫోర్లు కొట్టాడు.

అయితే, శాంసన్ కు మరో ఎండ్ లో సహకారం అందించే వాళ్లు కరవయ్యారు. మహిపాల్ లోమ్రోర్ 19 పరుగులు చేశాడు. మరే బ్యాట్స్ మన్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే 2, ఆవేశ్ ఖాన్ 1, అశ్విన్ 1, రబాడా 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.