తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్ ఎర్టీ డిటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ…రాష్ట్రంలో త్వరలో 1400అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీతో తెలంగాణలో వైద్య సేవలు మరింత మెరుగువుతాయని అన్నారు. త్వరలో నిమ్స్ లో 250పడకలు గాంధీలో 200పడకలతో ఎంసీహెచ్ ఆసుపత్రులను తీసుకువస్తామని తెలిపారు.
కేసీఆర్ కిట్ మిడ్వైఫరీ అమ్మ ఒడి వాహనాలు న్యూట్రిషన్ కిట్ లాంటి పథకాల ద్వారా గర్భిణీలుకు బాలింతలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గుదల ఉందన్నారు. గతంలో 5, 6 స్థానంలో ఉంటే ఇప్పుడు దేశంలో మూడవ స్థానంలో ఉంటున్నామని అన్నారు. ఇంకా మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో సూమారు 82శాతం ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. దీన్ని స్పూర్తిగా తీసుకుని మరింత కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలపాలని సంబంధిత అధికారులకు సిబ్బందికి పిలుపునిచ్చారు. ప్రసవం తర్వాత బాలింతలకు ఏవైనా ఇన్‌ఫేక్షన్లు ఉన్నాయోమో పరిశీలించి ఇంటికి పంపించాలని సూచించారు. అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఇవి కూడా చదవండి…