ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో శివతాండవం చేయగా, స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో నిప్పులు చెరిగాడు. వీరిద్దరి సమిష్టి కృషితో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించి, టోర్నమెంట్‌లో క్వాలిఫైయర్ 2కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ బౌలింగ్‌ను చెండాడుతూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న 30 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టేంత పని చేశాడు. ప్యాట్ కమిన్స్‌ను టార్గెట్ చేస్తూ 25 పరుగులు రాబట్టడం ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఈ హై-స్కోరింగ్ మ్యాచ్ ఐపీఎల్ ప్లేఆఫ్ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (మొత్తం 26 సిక్సర్లు) నమోదైన ఆల్-టైమ్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ రేసులో నిలవగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
ఇక ఈ సీజన్‌లో రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు వైభవ్ సూర్యవంశీ, జోఫ్రా ఆర్చర్. ఇటు బ్యాటింగ్‌లో వైభవ్..బౌలింగ్‌లో ఆర్చర్ అద్భుతంగా రాణిస్తుండటంతో ఆ జట్టుకు తిరుగులేని విజయాలను అందుకుంటోంది.
Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

