ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని పేదల నుండి రూ.20 కోట్లు కాజేశాడు తెలంగాణ బీజేపీ నాయకుడు. డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ భూమిలో పట్టాలు చేయించాడు ఆ బీజేపీ నేత. హైదరాబాద్ – మేడ్చల్ జిల్లా చెంగిచర్ల గ్రామంలోని సర్వే నంబర్ 58లో 1500 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని రూ.20 కోట్లు వసూలు చేశారు హిమాయత్‌నగర్ డివిజన్ విఠల్ వాడికి చెందిన బీజేపీ సెంట్రల్ జిల్లా సెక్రటరీ.
60 గజాల స్థలం ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుండి రూ.60 వేల నుండి రూ.3 లక్షలు వసూలు చేసి పట్టాలు కూడా ఇచ్చాడు. అయితే పట్టాలు తీసుకుని భూమి వద్దకు వెళ్లి చూడగా అది ప్రభుత్వ భూమి అని తెలిసి భూ పరిపాలన కార్యాలయానికి వెళ్లి అడిగితే అవన్నీ నకిలీ పట్టాలని తేల్చారు అధికారులు.
దీంతో సదరు బీజేపీ నాయకుడిని నిలదీసేందుకు వెళితే సీపీఐ వాళ్లు ఇచ్చారని చెప్పండి అంటూ బుకాయించాడని…డబ్బులు తిరిగి ఇవ్వమంటే దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.ప్రభుత్వం వెంటనే స్పందించి బీజేపీ నాయకుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ALso Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

