2026-27 దులీప్ ట్రోఫీ సీజన్ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఉపసారథి (వైస్ కెప్టెన్) బాధ్యతలు అప్పగించగా వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఈ నిర్ణయాన్ని ప్రశ్నించారు. రెడ్ బాల్ క్రికెట్‌లో అతను ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో సాధించింది కేవలం 207 పరుగులు మాత్రమే అని భోగ్లే వ్యాఖ్యానించారు.
రాబోయే 2026-27 దులీప్ ట్రోఫీ దేశవాళీ సీజన్ కోసం ఈస్ట్ జోన్ సెలెక్టర్లు అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఉన్న ఈ జట్టులో కెరీర్ ప్రారంభంలోనే ఉన్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. కొంతమంది అభిమానులు, నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా మరికొందరు మాత్రం ఇంత చిన్న వయసులోనే అతనికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన ఏంటో అర్థం కాక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతదేశ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా, రెడ్ బాల్ (ఫస్ట్ క్లాస్) క్రికెట్‌లో ఇంకా ఏమాత్రం నిరూపించుకోని సూర్యవంశీకి ఈ బాధ్యతలను ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం చేశారు.
ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష ప్రతిభ కనబరిచి వేగంగా ఎదుగుతున్న సూర్యవంశీకి, ఈస్ట్ జోన్ జట్టులో చోటు దక్కించుకోవడమే ఒక పెద్ద మైలురాయి. అయితే, రెడ్ బాల్ క్రికెట్‌లో అతనికి సరైన అనుభవం లేదని, నేర్చుకునే ప్రక్రియలోనే ఉన్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:దుల్కర్..’ఐ యామ్ గేమ్’
ఈస్ట్ జోన్ జట్టు:
ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ ఘరామీ, మహమ్మద్ షమీ, ముకేష్ కుమార్, షాబాజ్ అహ్మద్, సూరజ్ జైస్వాల్, విరాట్ సింగ్, కుమార్ కుషాగ్రా, శిఖర్ మోహన్, శుభ్రాంశు సేనాపతి, అభిజిత్ సర్కార్, అనుకూల్ రాయ్, డెనిష్ దాస్.

