ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఆ అమ్మాయి కన్నుకొడితే సోషల్‌మీడియా షేక్ అయ్యింది. సెలెబ్రిటీలు సైతం అవాక్కవుతూ..ప్రియాకి పడిపోయారు. టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు కూడా ప్రియావారియర్ హావభావాలకు ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే.
అయితే ప్రియా కన్నుకొడితే యూత్, సెలెబ్రిటీలే కాదు..తాజాగా పోలీసులు కూడా పడిపోయారు. అంతేకాదు ప్రియా కన్నుకొట్టినట్టు ఉన్నఫొటోకి మెరుపులు కూడా దిద్దారు వడోదరా పోలీసులు. అవును..గుజరాత్ లోని వడోదరా పోలీసులు ప్రియా ఫొటోని వెరైటీగా వాడేస్తున్నారు.
ప్రియా కన్నుకొడుతున్న ఫొటో పక్కన రెప్పపాటులో ప్రమాదాలు జరగవచ్చని ఓ కొటేషన్ పెట్టి, దానికింద ప్రయాణాల్లో నిర్లక్ష్యం వద్దు..జాగ్రత్తగా వెళ్ళండని ట్రాఫిక్ ఏక్ సంస్కార్ అని హ్యాష్ టాగ్ కూడా పెట్టారు.
ఈఫోటోనే ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతూ..నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది. ఇక ఇదంతా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకేనంటూ చెప్తున్నారు వడోదర పోలీసులు. మొత్తానికి ప్రియా ఫొటోని ఇలా కూడా వాడుకున్న వాళ్ళు ఈ పోలీసులేనేమో. చూడాలి మరి వీరి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో..