వచ్చేనెల 3న కేసీఆర్ ఢిల్లీ టూర్‌….

195
KCR Heads To Delhi Now For His Federal Front....
- Advertisement -

సీఎం కేసీఆర్‌ వచ్చే నెల 3న ఢిల్లీకి వెళ్ళే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీచేసిన జోగినపల్లి సంతోష్ కుమార్‌, బండ ప్రకాశ్ ముదిరాజ్‌, బడుగుల లింగయ్యయాదవ్‌ గెలుపొందారు.

  KCR Heads To Delhi Now For His Federal Front....

ఈ క్రమంలోనే ఢిల్లీలోని రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని సమాచారం. ఈ సందర్బంగా పలువురు జాతీయ నాయకులను కేసీఆర్‌ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా కేసీఆర్‌ చేస్తోన్న ప్రయత్నాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -