సూపర్ స్ప్రైడర్స్ వీరే..!

150
vaccine
- Advertisement -

రాష్ట్రంలో ఈ నెల 28 నుండి సూపర్ స్ప్రైడర్స్‌కి టీకాలు వేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్ప్రైడర్స్‌ అయిన జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్సు డ్రైవ‌ర్లు, హోట‌ల్స్, సెలూన్ల సిబ్బంది, కూర‌గాయ‌ల వ్యాపారులు, కిరాణా దుకాణ‌దారులు, హ‌మాలీల‌కు టీకాలు వేయాల‌ని నిర్ణయించింది.అలాగే గ్యాస్ డెలివరీ బాయ్స్.. రేష‌న్ దుకాణాల డీల‌ర్లు, పెట్రోల్ పంప్ వ‌ర్కర్లు, పండ్లు, పూలు అమ్ముకునే వారు,నాన్ వెజ్ మార్కెట్లలో ఉండేవారికి టీకా కోసం స్పెషల్ డ్రైవ్ చేప‌ట్టాల‌ని నిర్ణయించారు.

తెలంగాణ వ్యాప్తంగా సుమారు 30 లక్షల వరకు సూపర్ స్పైడర్స్ ఉంటారని అంచనా వేయగా జనాలు ఎక్కువగా చేరే వారిని సూపర్ స్ప్రెడర్స్‌గా గుర్తించింది ప్రభుత్వం. వైద్య సిబ్బంది స్వయంగా వారి వ‌ద్దకే వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రైవేట్ సంస్థలు వాక్సినేషన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 58వేల కోవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇక కోవిషీల్డ్ డోసులు 2 లక్షల 42 వేలు అందుబాటులో ఉండగా.. సోమవారం రాత్రి మరో 2 లక్షల 45 వేల డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి.

- Advertisement -