ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నాం…

37
anjani kumar

ప్రజల ప్రాణాల రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు సీపీ అంజనీ కుమార్. హైదరాబాద్‌లో లాక్ డౌన్ పరిస్ధితిపై మాట్లాడిన సీపీ…క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్రాణాలు ఫ‌ణంగా పెట్టి విధులు నిర్వ‌ర్తిస్తున్నామ‌ని వెల్లడించారు.ఈ-పాసుల‌ను దుర్వినియోగం చేసే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తున్నామ‌ని సీపీ తెలిపారు.

ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ప్ర‌జ‌లు క‌చ్చితంగా పాటించాలని…… అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి ఎవ‌రూ రావొద్దన్నారు. వాహ‌నాలు సీజ్ అయితే లాక్‌డౌన్ పూర్త‌యిన త‌ర్వాతే అప్ప‌గిస్తామ‌ని… 99 శాతం లాక్‌డౌన్ విజ‌య‌వంత‌మైందన్నారు.