- Advertisement -
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా వారంలో కొన్ని రోజులు మాత్రమే టీకాలను వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ నెలంతా కరోనా టీకాలను వేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే గెజిటెడ్ సెలవు రోజుల్లోనూ కూడా టీకా కేంద్రాలు అందుబాటులో ఉండాలి తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది.
ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం సూచించింది. అత్యంత వేగంగా ఎక్కువ మందికి టీకాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ రోజు నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేయాలని సూచించింది.
- Advertisement -