సీఎం రేవంత్‌తో వీహెచ్‌ భేటీ

37
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు భేటీ అయ్యారు. ఇవాళ రేవంత్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వీహెచ్‌ను రేవంత్‌తో కలిపించారు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా వీహెచ్‌కు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు రేవంత్. నాయకులందరిని కలుపుకుని వెళ్లాలనే ఆలోచనతో ఉన్నానని చెప్పారు.

ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఆశీంచారు వీహెచ్‌. అయితే పార్లమెంట్ టికెట్ తనకు ఇచ్చే అవకాశం లేదని అలకబూనారు. గత కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల మీడియా ముందు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో మహేష్‌ కుమార్‌ను మధ్యవర్తిగా వీహెచ్‌ దగ్గరికి పంపారు రేవంత్.

Also Read:IPL 2024 :ముంబైతో హైదరాబాద్ ఢీ!

- Advertisement -