భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతోంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో గంగోత్రి హైవేలో రెండు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. చింకా సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేశారు. హరిద్వార్ వద్ద గంగా నదిలో పెరిగిన నీటి ప్రవాహం పెరిగింది.అలాగే ఉత్తరకాశీ ప్రాంతంలో భారీ వర్షాలకు భగీరథ నదికి పెరిగిన ప్రవాహం పెరిగింది.
గంగా నది ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. గంగా నదిలో ఓ కారు పడిపోయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి జాడ తెలియరాలేదు.
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. పర్యాటక ప్రదేశం మనాలీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడి వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్ లో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
Also Read:సామ్ ఎమోషనల్..6 నెలలు ఎలా!