ఉత్తరాఖండ్‌లో భారీ వరదలు.. ఆరుగురు మృతి..

143
- Advertisement -

ఉత్తరాఖండ్‌లో గత రెండు రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరదలు పోటెత్తుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. వాతావరణ పరిస్థితులు మెరుగు అయ్యేంతవరకు యాత్రకు అనుమతి నిరాకరించారు. వర్షాలు తగ్గి, పరిస్థితి చక్కబడేదాకా ముందుకెళ్లకూడదని చార్‌ధామ్‌ యాత్రికులకు అధికారులు సూచించారు.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. భారీ వర్షాలతో నందాకిని నదికి భారీ వరద చేరుతోంది. రెండు రోజుల నుంచి 230కి పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉత్తరాఖండ్ నుంచి వెళ్లే జాతీయ రహదారులు, కొండ ప్రాంతాల రోడ్ల మూసిశారు. బద్రీనాథ్, కేదరినాథ్ జాతీయ రహదారులు మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. యాత్రకు వచ్చిన వారు బయటకు రావద్దని సూచించారు.

వర్ష బీభత్సంపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారులు, వంతెనల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.. పరిస్థితులను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -